ప్రవాసాంధ్రుల కోసం కథలు- కవితల పోటీ

విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి నుంచి రచనలను ఆహ్వానిస్తోంది TAGS.ఈ మేరకు ప్రకటన విడుదల చేసారు. తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ.. ప్రవాస తెలుగువారి ఆనందాలు, ఉత్సాహాలు, కష్టాలు,అనుభూతులు,ఆశ్చర్యాలు అన్ని కవితలుగా గానీ,కథలుగానీ ఏర్చి కూర్చి పంపవచ్చు. అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS)వారు “శ్రీ UAN మూర్తి మెమోరియల్ “ సంస్మరణలో ఈ పోటిని నిర్వహించటం జరుగుతోంది. భారత దేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ (ప్రవాస తెలుగు వారు) ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని సవినయంగా కోరుతున్నారు. ఇక మూడు వేలమందికి పైగా స్థానిక సభ్యులను కలిగి ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు భాష, తెలుగు సంస్కృతి వ్యాప్తి కి 2003 సంవత్సరం నుండి శాక్రమెంటో లో విశేష కృషి చేస్తుంది. అమెరికా, కెనడా, యూరోప్ మరియూ ఇతర విదేశాలల్లొ నివసిస్థున్న తెలుగు రచయితలకు ఈ సందర్బంగా ఆహ్వానం పలుకుతున్నారు. రచనలు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 15, 2018

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత తెలుగు రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నారు. ఉత్తమ కథానిక: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28 ఉత్తమ కవిత: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28

“మొట్ట మొదటి రచనా విభాగం” కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరికొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితలను ఈ తెలుగు రచనా విభాగం “పోటీ” లో పాల్గొనమని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు.

ఉత్తమ కథానిక: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28 ఉత్తమ కవిత: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు ఒకే రచయిత ఒక్కో పోటీ లో ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. కథలు పది పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. పేజీ గరిష్ఠ కొలత 8.5 అంగుళాలు X 11 అంగుళాలు ఉండాలి. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.