ప్రవాసాంధ్రుల కోసం కథలు- కవితల పోటీ

రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్, స్వంత పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న లేదా ప్రచురించబడిన రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథానిక “, “మొట్టమొదటి కవిత” పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి. హామీపత్రం/ధ్రువీకరణ పత్రం ఇక్కడ నుండి డౌన్ లోడు చేసుకొనగలరు: https://tinyurl.com/tagsform :: డౌన్ లోడు చేసుకున్న పిదప సదరు పత్రం పూరించి, మీ రచన(ల)తో పాటుగా మాకు ఈమెయిలు చెయ్యగలరు.

రచనల్లో ఎక్కడా మీ పేరు కానీ, మీ కలం పేరు కాని వ్రాయకూడదు. మీ రచనలు మాకు పంపినప్పుడు, మీ హామీపత్రం లో ఆవివరాలు రాస్తే సరిపోతుంది. మీ రచనలను తెలుగులో టైపు చేసి పంపితే బాగుంటుంది. యూనికోడ్ (Unicode) లో ఉన్న మీ రచనలు పంపితే మాకు శ్రమ తగ్గించిన వారు అవుతారు అని గమనించగలరు. చేతిరాత ప్రతులను పంపేవారు సదరు రచయిత చేతిరాత స్పష్టంగా, చదువ శక్యంగా ఉండాలని మనవి. అస్పష్ట, సందిగ్ధమైన లేదా చదవడానికి వీలుకాని రచనలు పోటీకి పరిశీలింపబడవు.

బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది (http://www.koumudi.net) , సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org ), శాక్రమెంటో స్థానిక పత్రిక “సిరిమల్లె” http://sirimalle.com , మరియూ ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.

బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు TAGS వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో ప్రచురించబడతాయి. విజేతల వివరాలు రాబోయే సంక్రాంతి 2019 పండుగ కు ముందు ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితలు ఇతర పోటీలకు, ఇంకెక్కడా ప్రచురించ కూడదు.

కాలిఫొర్నియా లో శాక్రమెంటో నగరం లో, జనవరి 19, 2019 న జరగబోయే TAGS 16వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా సభా ముఖంగా వేదికపై విజేతలకు బహుమతులు అందజేయబడతాయి, రాలేనివారికి పోస్టులో బహుమతులు పంపడం జరుగుతుంది. విదేశాలలో ఉంటున్న తెలుగు రచయితలకి ఇది ప్రత్యేక అవకాశం. పోటీలొ పాల్గొనే రచయితలకు 18 ఏండ్లు నిండి ఉండాలి. విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

Last Date to receive entries is: December 15, 2018 Please send entries by e-mail attachments only (PDF, JPEG or Unicode fonts – Unicode is preferred) To: telugusac@yahoo.com

శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం

నాగ్ దొండపాటి (అధ్యక్షులు), అనిల్ మండవ (చైర్మన్), దుర్గ చింతల (కార్యదర్శి), మల్లిక్ సజ్జనగాండ్ల (వైస్ చైర్మన్), మోహన్ కాట్రగడ్డ (కోశాధికారి), వెంకట్ నాగం (సంపాదకులు, ట్రస్టీ), రాఘవ చివుకుల (సమాచార అధికారి) సత్యవీర్ సురభి (సలహామండలి సభ్యుడు)